పౌరసత్వ సవరణ చట్టంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు హోరెత్తుతుంటే.. మరో వైపు ఈ సవరణ ద్వారా లబ్ధి పొందే శరణార్థులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. భాజపా ప్రభుత్వం, ప్రధాని మోదీకి తమదైన రీతిలో ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో స్థిరపడిన ఓ పాకిస్థానీ హిందూ మహిళ మోదీ కోసం పాట పాడి మరీ కృతజ్ఞతలు తెలిపింది.
వందలాది మంది శరణార్థులు పాకిస్థాన్ నుంచి భారత్కు వచ్చి పౌరసత్వం లేకుండానే జీవిస్తున్నారు. వారిలో దిల్లీలోని మజ్నూ టీలా బస్తీలో ఉంటున్న వన్ దేవీ ఒకరు. అలాంటి వారికి లబ్ధి చేకూర్చడానికి తీసువచ్చిన సీఏఏను అభినందిస్తూ ఏర్పాటు చేసిన ఓ సభలో వన్దేవీ పాల్గొంది. వేదికపై ఇప్పటికీ పాకిస్థాన్లో మగ్గుతున్న హిందువుల కోసం ఆమె పాట పాడింది.
ఆ తరువాత ఈటీవీ భారత్ వన్దేవీని కలిసి సీఏఏపై ఆమె అభిప్రాయాన్ని అడిగినప్పుడు... 'మోదీ నా మీద ఒట్టు... మీరు ధైర్యం కోల్పోవద్దు. దిగజారిపోయిన మా రాతలను మీరే మార్చాలి..' అంటూ పాట పాడి మరీ మోదీకి ధన్యవాదాలు తెలిపింది.