తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో సంస్కరణల పథం కొనసాగుతుంది: మోదీ

దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించే కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. దేశంలో సంస్కరణల పథం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా నిర్ణయాలు వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, అంతరిక్ష రంగ పురోగతికి ఊతమిస్తాయని వెల్లడించారు.

By

Published : Jun 24, 2020, 10:53 PM IST

PM on Cabinet decisions
మోదీ

కేంద్ర కేబినెట్​ బుధవారం తీసుకున్న కీలక నిర్ణయాలు దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయం, గ్రామాలు, చిన్న వ్యాపారాలకు సహకారంతో పాటు అంతరిక్ష రంగంలో మెరుగైన ప్రగతి సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.

కేబినెట్ భేటీ అనంతరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కోట్లాది భారతీయులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

"దేశంలో సంస్కరణ పథం కొనసాగుతుంది. అంతరిక్ష రంగంలో సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మన దేశం స్వావలంబనతో పాటు సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి ఊతమిస్తుంది. ఈ సంస్కరణలు ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని కూడా పెంచుతాయి."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

కేబినెట్​ భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలపై మోదీ వివరించారు.

  • ఎంఎస్​ఎంఈలకు సంబంధించి ప్రధానమంత్రి ముద్ర యోజన కింద శిశు రుణ ఖాతాలకు వడ్జీ ఉపసంహరణ పథకానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో చిన్న వ్యాపారాలకు మద్దతు లభించటంతో పాటు స్థిరత్వం ఏర్పడుతుందన్నారు.
  • పశు సంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటు ద్వారా ఈ రంగానికి బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు, రంగాలవారీగా మౌలిక సదుపాయాలతో ముఖ్యంగా పాడి పరిశ్రమ పురోగతి సాధిస్తుందని తెలిపారు.
  • ఇదే భేటీలో ఉత్తర్​ప్రదేశ్​లోని కుషి నగర్​ ఎయిర్​పోర్ట్​ను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

ఇదీ చూడండి:ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

ABOUT THE AUTHOR

...view details