తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈవీఎంలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి' - M Veerappa Moily

ఈవీఎంల పనితీరుపై మరోమారు సందేహాలు వ్యక్తం చేశారు కాంగ్రెస్​ నేత వీరప్ప మొయిలీ. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వినియోగించాలా? లేక మళ్లీ బ్యాలెట్​ విధానాన్ని తీసుకురావాలా? అనే విషయాన్ని నిర్ణయించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

'ఈవీఎంలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి'

By

Published : Jun 18, 2019, 5:48 AM IST

Updated : Jun 18, 2019, 8:46 AM IST

'ఈవీఎంలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి'

ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మిషన్​ (ఈవీఎం)ల పనితీరుపై కాంగ్రెస్​ పార్టీ మరోమారు అనుమానాలను వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్​ నేత వీరప్ప మొయిలీ.

"ప్రతి ఒక్కరు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తీవ్రమైన సమస్య. అమెరికా లాంటి చాలా దేశాలు ఈవీఎంలను వినియోగించి తిరిగి బ్యాలెట్​ ఓటింగ్​కే మొగ్గుచూపాయి. అభ్యంతరాలు ఉన్నప్పుడు ఈవీఎంలను తొలగించి బ్యాలెట్​కు తిరిగి వెళ్లాలి. ఎన్నికల ప్రక్రియపై తలెత్తిన ఈ ప్రశ్నపై ప్రజాభిప్రాయం సేకరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఆ పనిని ప్రభుత్వం తప్పకుండా చేయాలనుకుంటున్నా. ప్రజాభిప్రాయాన్ని కూడా యంత్రాల ద్వారా కాకుండా బ్యాలెట్​ ద్వారా సేకరించాలి."

- వీరప్ప మొయిలీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత

ఒకవేళ ప్రజాభిప్రాయం ఈవీఎంలకే అనుకూలంగా వస్తే నష్టమేమీ లేదన్నారు మొయిలీ. కానీ ఈవీఎంలపై ఉన్న సందేహాలు నివృత్తి అవుతాయని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై స్పందించకపోవటం వల్ల ఎన్నికల సంఘంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని విమర్శించారు.

ఇదీ చూడండి: బిహార్​: వడదెబ్బకు 3 రోజుల్లో 76 మంది బలి

Last Updated : Jun 18, 2019, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details