కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వాలు సమర్థంగా పని చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఫలితంగా కొవిడ్ రోగులు కోలుకోవడం, మరణాల రేటు తగ్గించడంలో పురోగతి సాధిస్తున్నామన్నారు అధికారులు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల కంటే రికవరీలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. మరణాల రేటు స్థిరంగా తగ్గుతోందన్నారు.
'గడిచిన ఐదు నెలల్లో మూడొంతుల మంది వైరస్ నుంచి కోలుకోగా... నాలుగో వంతు మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కేసుల కంటే రికవరీలే 18లక్షలు అధికంగా ఉన్నాయి. మరణాల రేటు 1.82 శాతానికి తగ్గింది' అని మంత్రిత్వ శాఖ తెలిపింది.