భారత్లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. చాలా రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది.
- మహారాష్ట్రలో కొత్తగా 2,535 మందికి కరోనా సోకింది. 60 మంది మరణించారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 46,034కు చేరింది. ప్రస్తుతం 84,386 యాక్టివ్ కేసులున్నాయి. ముంబయిలో 409 కేసులు నమోదయ్యాయి.
- తమిళనాడులో ఆదివారం కొత్తగా 1,725 మందికి వైరస్ సోకింది. 17 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 11,495గా ఉంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,765కు తగ్గింది.
- కర్ణాటకలో కొత్తగా 1,157 మంది వైరస్ బారిన పడ్డారు. 12 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 11,541కి చేరింది. ప్రస్తుతం 26 వేలకు పైగా యాక్టివ్ కేసులుండగా మొత్తం కేసుల సంఖ్య 8,62,804గా ఉంది.
- కేరళలో కొత్తగా 2,710 మంది వైరస్ బారినపడగా 6,567 మంది కోలుకున్నారు. సోమవారం 19 మంది మరణించారు. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 70,925గా ఉంది.
పెరిగిన రికవరీ రేటు..