ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూకు చెందిన ఓ వైద్యుడు ఇటీవలే వైరస్‌ను జయించారు. తాజాగా ప్లాస్మా థెరపీ కోసం తన ప్లాస్మాను దానం చేయడానికి ముందుకుచ్చారు.
'వెంటనే ఒప్పుకున్నా..'
లఖ్‌నవూలోని కింగ్ జార్జియా వైద్య విశ్వవిద్యాలయం(కేజీఎమ్యూ)లో వైద్యుడిగా పనిచేస్తున్న తౌసీఫ్కు మార్చి 17న వైరస్ పాజిటివ్‌గా తేలింది. కరోనాను జయించి ఈ నెల 7న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. 14 రోజుల క్వారంటైన్ అనంతరం తిరిగి విధుల్లో చేరారు.
"ప్లాస్మా థెరపీ కోసం వైద్యులు నన్ను సంప్రదించారు. కేజీఎమ్యూ నుంచి ప్లాస్మా దానం చేసే తొలి వ్యక్తిగా నేను ఉంటానని, అందుకు నా అంగీకారం అడిగారు. నేను వెంటనే ఒప్పుకున్నా. పవిత్ర రంజాన్ మాసంలో రోగులను రక్షించడం కన్నా గొప్ప విషయం ఇంకేదీ ఉండదు."
--- తౌసీఫ్ ఖాన్, వైద్యుడు.
శనివారం వైద్యులు తౌసీఫ్ శరీరం నుంచి దాదాపు 500 మిల్లిలీటర్ల ప్లాస్మాను సేకరించారు. ఇందుకోసం గంటన్నర సమయం పట్టిందని వైద్యులు వెల్లడించారు.