హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా నుంచి కోలుకున్న తబ్లిగీ జమాత్ సభ్యుడికి మళ్లీ వైరస్ పాజిటివ్‌గా తేలింది. రెండు సార్లు పరీక్షించిన తర్వాత కరోనా నెగటివ్‌గా రావటం వల్ల గత వారంలో డిశ్చార్జి అయ్యాడు ఈ వ్యక్తి.
అతనిలో మళ్లీ కరోనా లక్షణాలు కనిపించటం వల్ల వైద్యులను సంప్రదించాడు. నిర్ధరణ పరీక్షలు చేయగా వైరస్ పాజిటివ్‌గా తేలింది.
జమాత్ సభ్యుడే..
మండీ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు జమాత్ సభ్యులు నక్రోహ్ గ్రామంలోని మసీదులో ఉంటున్నారు. వీరికి ఏప్రిల్ 2న కరోనా పాజిటివ్‌గా తేలటం వల్ల కాంగ్డా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు అధికారులు.
నిబంధనల ప్రకారం వీరికి ఏప్రిల్ 10న పరీక్షలు చేయగా నెగటివ్‌గా వచ్చింది. ఏప్రిల్ 12న మరోసారి చేయగా అదే ఫలితం పునరావృతం అయింది. ఈ కారణంగా వీరి ముగ్గరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి క్వారంటైన్లో పెట్టారు.
వీరిలో ఒకరికి మళ్లీ పాజిటివ్‌గా రాగా.. హిమాచల్ ప్రదేశ్‌లో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 23కు చేరింది.
ఇదీ చూడండి:దీర్ఘకాలంలోనూ కరోనా వైరస్ ప్రభావం?