కరోనా మరణాల రేటులో తగ్గుదల కనిపిస్తోందని..దేశంలో మొదటి లాక్డౌన్ తర్వాత తొలిసారిఅత్యల్పంగా 2.10 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల కంటే వైరస్ను జయించినవారి సంఖ్య కూడా రెట్టింపు అయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు.
ఆర్టీ-పీసీఆర్, రాపిడ్ యాంటీజెన్ పరీక్షల నిర్వహణలో రాష్ట్రాలు వేగం పుంజుకున్నాయని రాజేష్ తెలిపారు. ఫలితంగా ప్రతీ 10 లక్షల జనాభాలో రోజుకు 140 మందికి పరీక్షలు జరుగుతున్నాయని.. వీటిల్లో గోవా, దిల్లీ, త్రిపుర, తమిళనాడు ముందంజలో ఉన్నాయన్నారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..
- భారత్లో పాజిటివిటీ రేటు 8.89 శాతంగా ఉంది.
- పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, హరియాణా, అసోం, పశ్చిమ్ బంగా, కర్ణాటక రాష్ట్రాల్లో 10 శాతం కన్నా తక్కువే ఉంది.
- గడచిన 24 గంటల్లో 6.6 లక్షల మందికి కరోనా పరీక్షలు జరిగాయి. ఫలితంగా దేశంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికిపైగా కొవిడ్ టెస్టులు పూర్తయ్యాయి.
- మొదటి లాక్డౌన్ తర్వాత తొలిసారిగా వైరస్ మరణాల రేటు అత్యల్పంగా 2.10 శాతానికి చేరింది.
- దేశంలో ప్రస్తుతం 5,86,298 యాక్టివ్ కేసులున్నాయి. 12లక్షల మందికిపైగా కొవిడ్ నుంచి కోలుకున్నారు.
- కరోనా వల్ల మరణించిన వారిలో 50 శాతం మందికిపైగా 60ఏళ్లు పైబడిన వారు. 37 శాతం మంది 45 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు వారు.
ఇదీ చూడండి:'ఆ మరణాల లెక్కలు చెబితేనే కరోనా ప్రభావంపై స్పష్టత'