రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- ఒక్కరోజే 3.2 లక్షలు
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో వైరస్ పరీక్షలను ముమ్మరం చేసింది కేంద్రం. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3 లక్షలకుపైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించింది. దీంతో జులై 14 వరకు చేసిన పరీక్షల సంఖ్య మొత్తం 1.24కోట్లకు చేరింది.
రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు.. ఒక్కరోజే 3.2 లక్షలు
By
Published : Jul 15, 2020, 5:11 PM IST
కొవిడ్ పరీక్షలను వేగవంతం చేసింది కేంద్రం. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,20,161 వైరస్ నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది. దీంతో జులై 14 నాటికి చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 1,24,12,664కు పెరిగిందని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది.
మార్చి 25 నాటికి ఒక్కరోజులో నిర్వహించే కొవిడ్ పరీక్షల సంఖ్య సగటున 1.5 లక్షలు ఉండేది. ప్రస్తుతం ఇది 4 లక్షల చేరువలో ఉన్నట్లు ఐసీఎంఆర్ వైద్యులు తెలిపారు.
అందులో గోవా ఫస్ట్..
వైరస్ అనుమానితులను గుర్తించడానికి ప్రతి మిలియన్ జనాభాలో రోజుకు 140 మంది పరీక్షించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. అయితే 22 రాష్ట్రాల్లో సగటున 140కి పైగా పరీక్షలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిల్లో గోవా, దిల్లీ, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ప్రతి 10 మిలియన్ల మందికి ఏ రాష్ట్రంలో ఎన్ని టెస్టులు...
రాష్ట్రం
టెస్టులు
గోవా
1,058
దిల్లీ
978
తమిళనాడు
563
అసోం
310
కర్ణాటక
297
మధ్యప్రదేశ్
249
ఝార్ఖండ్
242
రాజస్థాన్
235
మహారాష్ట్ర
198
కరోనా పరీక్షలు ఎక్కువగా చేయడం వల్ల ఒక్కరోజులో నమోదవుతున్న వైరస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో 29 వేల 429 మంది కొవిడ్ బారినపడ్డారు.