తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లండన్​ వర్సిటీల్లో 'మనోళ్లు' పెరిగారు - latest national news

లండన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే భారత్​ విద్యార్థులు రికార్డు స్థాయిలో పెరిగారు. 2017-18తో పోల్చితే 2018-19 విద్యా సంవత్సరంలో ఏకంగా 34.7శాతం మంది పెరిగి.. యూకే రాజధానిలో మూడో అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి మార్కెట్​గా నిలిచింది. బ్రెగ్జిట్​ డే ముందు విద్యార్థులు ఆశాజనకంగా పెరిగినట్లు గుర్తుచేసింది లండన్​కు చెందిన ఉన్నత విద్యా గణాంక సంస్థ(హెచ్​ఈఎస్​ఏ) నివేదిక.

Record
లండన్​ వర్సిటీల్లో మనోళ్లు పెరిగారు

By

Published : Jan 29, 2020, 11:17 PM IST

Updated : Feb 28, 2020, 11:09 AM IST

విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది లండన్​నే ఎంచుకుంటున్నారు. 2018-19 విద్యా సంవత్సరంలో అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఏకంగా 34.7 శాతం మంది పెరగడం గమనార్హం. ఈ క్రమంలో లండన్ మూడో అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి మార్కెట్​గా భారత్​ నిలిచినట్లు యూకేకు చెందిన ఉన్నత విద్యా గణాంక సంస్థ(హెచ్​ఈఎస్​ఏ) బుధవారం వెల్లడించింది. చైనా, అమెరికా మొదటి రెండు, ఇటలీ, ఫ్రాన్స్​ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది.

రెండేళ్ల పోస్ట్ స్టడీ వీసా

యూకే ప్రభుత్వం ఇటీవల అంతర్జాతీయ విద్యార్థుల కోసం రెండేళ్ల పోస్ట్ స్టడీ వీసాను ప్రవేశపెట్టింది. విదేశీ గ్రాడ్యుయేట్ల ఉపాధికి ఎక్కువ సమయం కేటాయించటానికి వీలు కల్పిస్తుండటంతో అడ్మిషన్లు పెరిగినట్లు హెచ్​ఈఎస్​ఏ నివేదిక చెబుతోంది.

2018-19లో లండన్ విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులు మొత్తం 125,035 మంది ఉన్నారు. 2017-18తో పోల్చితే 5.3 శాతం మంది పెరిగారు.

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది యువకులు వారి ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్‌ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలా చేయడం ద్వారా వారు ప్రపంచంలో అత్యుత్తమ సంస్థలను ఉత్పత్తి చేసిన గ్లోబల్ కమ్యూనిటీలో భాగమవుతున్నారు. ప్రపంచంలోని ఉన్నత విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. "

-రాజేష్ అగర్వాల్, భారత సంతతికి చెందిన లండన్​ డిప్యూటీ మేయర్

Last Updated : Feb 28, 2020, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details