భారత్‌లో మహమ్మారి వ్యాపించిన నాటి నుంచి కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నారు అధికారులు. ఈ క్రమంలో శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 7,19,364 నమూనాలు పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కొవిడ్ టెస్టుల సంఖ్య 2,41,06,535కు చేరింది.
రికార్డు స్థాయిలో రికవరీ..
రోజులో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 53,879 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు ఒక్కరోజులో రికవరీ అయినవారి సంఖ్యలో ఇదే అత్యధికం. ఫలితంగా మొత్తం 14,80,884 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.
రికార్డు స్థాయిలో రికవరీలు ఆరోగ్య శాఖ తెలిపిన ముఖ్యాంశాలు..
- దేశంలో ప్రతి నిమిషానికి రమారమి 500 కొవిడ్ పరీక్షలు జరుగుతున్నాయి.
- యాక్టివ్ కేసుల(6,28,747) కంటే కోలుకున్నవారి(14,80,884) సంఖ్య 2.36 రెట్లు అధికం.
- రికవరీ రేటు 68.78 శాతానికి ఎగబాకింది.
- మరణాల రేటు 2.01కు చేరింది.
ఇదీ చూడండి:'ఆత్మనిర్భర భారత్‌పై ఈనెల 15న మోదీ కీలక ప్రకటన'