తెలంగాణ

telangana

మోదీ లాక్​డౌన్-2​ ప్రసంగం సూపర్​హిట్​.. టీవీల్లోనే 20 కోట్ల వీక్షణలు

By

Published : Apr 16, 2020, 9:39 PM IST

కరోనాపై జాతినుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం సరికొత్త రికార్డును సాధించింది. ఏప్రిల్​ 14న ప్రసారమైన ఈ లైవ్​ను 20 కోట్ల 30 లక్షల మంది టీవీల్లో వీక్షించారని బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్​ రిసెర్చ్​ కౌన్సిల్​(బార్క్​) వెల్లడించింది. ఫలితంగా లాక్​డౌన్​-1 సమయంలో నమోదైన వీక్షణల రికార్డు బ్రేక్​ అయినట్లు బార్క్​ స్పష్టం చేసింది.

modi
మోడీ

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను మరో 19 రోజులు పొడిగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం రికార్డు వీక్షణలు సొంతం చేసుకుంది. ఏప్రిల్​ 14న జాతినుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ లైవ్​ను దేశవ్యాప్తంగా 20 కోట్ల 30 లక్షల మంది టీవీల్లో వీక్షించారని బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్​ రిసెర్చ్​ కౌన్సిల్​(బార్క్​) వెల్లడించింది.

పదో వంతు మాత్రమే..

తొలిసారి లాక్​డౌన్​ ప్రసంగాన్ని 19కోట్ల 30 లక్షల మంది వీక్షించారు. ఈ ప్రసంగాన్ని 199 ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయగా.. మొత్తం 400 కోట్ల నిముషాల పాటు ప్రజలు వీక్షించారు. ఇది కూడా ఒక రికార్డని బార్క్​ ప్రధాన కార్యనిర్వహకుడు సునీల్​లుల్లా తెలిపారు. అంతేకాకుండా 'ఆరోగ్య సేతు' యాప్‌ను రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ.. వారిలో పదోవంతు మంది మాత్రమే ఉపయోగిస్తున్నారని మార్కెట్​ పరిశోధన సంస్థ ఎసీ నీల్సన్​ తెలిపింది.

38 శాతం పెరిగిన టీవీ వినియోగం

కరోనా​ ప్రభావం ముందు కంటే ఏప్రిల్​ 12 తర్వాత టీవీల వినియోగం 38 శాతం పెరిగిందని బార్క్​ వెల్లడించింది. ఇందులో జాతీయ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ తొలిస్థానంలో ఉందని లుల్లా వెల్లడించారు. రామాయణం, మహాభారతం వంటి క్లాసిక్ షోలను ప్రారంభించడం ద్వారా ప్రైవేట్ రంగ ఛానెళ్లను వెనక్కినెట్టిందని ఆయన తెలిపింది.

దేశంలో కరోనా కేసులు నమోదైనప్పటి నుంచి.. జనతా కర్ఫ్యూ, తొలిదశ లాక్​డౌన్​ ప్రకటన, వైద్యుల సేవలను ప్రశంసిస్తూ చప్పట్ల కొట్టడం, రెండోదశ లాక్​డౌన్​ ప్రకటనతో కలిపి నాలుగు సార్లు మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details