కర్ణాటక రాజకీయం మలుపులు తిరుగుతూనే ఉంది. సంకీర్ణ ప్రభుత్వంపై అసంతృప్తితో రాజీనామా చేసి ముంబయిలో ఉంటున్న ఎమ్మెల్యేల్లో 10 మంది తమకు ప్రాణహాని ఉందని తాజాగా ముంబయి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ నేడు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చించడానికి ముంబయి వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ప్రాణహాని ఉందని 10 మంది శాసనసభ్యులు కమిషనర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.