తెలంగాణ

telangana

భారత్​ భేరి: కాశీలో చౌకీదార్​ X జవాన్

By

Published : Apr 8, 2019, 12:03 PM IST

ప్రధాని నరేంద్రమోదీ పోటీచేసే వారణాసిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కారణం.. నరేంద్రుడిపై పోటీ చేసే ప్రత్యర్థులు. ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి తండ్రి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి సహా చాలా మంది ఇక్కడ పోటీకి సిద్ధమయ్యారు. వారణాసిలో మోదీపై పోటీ చేస్తున్న బీఎస్​ఎఫ్​ మాజీ జవాన్​ తేజ్​ బహదూర్​ యాదవ్​.. మోదీ ఇక వెళ్లాల్సిందే అంటున్నారు.

వారణాసిలో మోదీపై పోటీకి తేజ్​ బహదూర్​ యాదవ్​

తేజ్​ బహదూర్​ యాదవ్​...జవాన్లకు అందించే ఆహారం నాసిరకంగా ఉందంటూ 2017 జనవరిలో ఓ వీడియోను సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. అప్పట్లో సంచలనంగా మారిన ఆ వీడియోతో ఆయన ఉద్యోగమే పోయింది.

ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు యాదవ్​. పోటీ చేసేది నేరుగా ప్రధాని నరేంద్రమోదీపైనే. ఇందుకోసం వారణాసి చేరుకున్నారు తేజ్​ బహదూర్​.

నకిలీ చౌకీదార్​ వెళ్లాల్సిందే అంటున్న తేజ్​ బహదూర్​ యాదవ్​

''నేను తేజ్​ బహదూర్​ యాదవ్. బీఎస్​ఎఫ్​లో అవినీతిని బయటపెట్టిన జవాన్​ను. దేశ ప్రజలందరూ నాకు మద్దతుగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వల్ల నా ఉద్యోగం పోగొట్టుకున్నాను. రోజూ చూస్తూనే ఉన్నాం. ప్రధాని నరేంద్రమోదీ ఒకవైపు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ.. వారే అవినీతిపరులకు సంరక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంతోనే నేను మోదీపై వారణాసి ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నాను.

దేశ ప్రజలు మొత్తానికి తెలుసు మోదీ ఏం చేశారో. తన పేరు ముందు చౌకీదార్​ అని మార్చుకున్న వ్యక్తికి ఇక సమాధానం చెప్పాలి. 'అసలైన చౌకీదార్​ వస్తున్నారు. నకిలీ చౌకీదార్​ వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది' అని తెలియచెప్పాలి. సైనికుల గురించి చర్చ మోదీ చుట్టూనే నడుస్తోంది. అవినీతిపై పోరాడతారని నేను ఆయనపై నమ్మకం ఉంచా. కానీ... సైనికుల కోసం చేసిందేమీ లేదు.

10 వేల మంది సైనికుల మద్దతు నాకు ఉంది. ఆమ్​ ఆద్మీ పార్టీ నాకు మద్దతిస్తుంది. ఓం ప్రకార్​ రాజ్​భర్​.. జన్​శక్తి అధ్యక్షులు రేణూచౌదరి మద్దతుంది. మా యాదవ్​సేన మొదటి నుంచీ నా వెంటే ఉంది. ఇంకా రామ్​ సేన ఉండనే ఉంది.

ఇంటింటి ప్రచారం నిర్వహిస్తాను. రైతులు అందరితో మాట్లాడతాను. నా మద్దతుదారులంతా ప్రతి ఇంటికీ వెళ్తాం. ప్రభుత్వం సైనికుల కోసం ఏం చేయలేదని ప్రచారం చేస్తాం. వాళ్ల పరిస్థితి వివరిస్తాం. గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేస్తున్నా. ప్రజల కళ్లు తెరిపిస్తా .''

- తేజ్​ బహదూర్​ యాదవ్​, బీఎస్​ఎఫ్​ మాజీ జవాన్​

ABOUT THE AUTHOR

...view details