తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యుద్ధం ఎప్పుడొచ్చినా నేను సిద్ధం: రజినీ

తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సినీ నటుడు సూపర్​స్టార్​ రజినీకాంత్​ ప్రకటించారు. శాసనసభ ఉపఎన్నికలతో రాజకీయ ముఖచిత్రం మారవచ్చన్న అంచనాల మధ్య తలైవా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

By

Published : Apr 19, 2019, 5:19 PM IST

యుద్ధం ఎప్పుడొచ్చినా నేను సిద్ధం: రజినీ

తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు సూపర్​స్టార్​​ రజినీకాంత్​ ప్రకటించారు. ఉపఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు దారితీయవచ్చా అన్న ప్రశ్నకు చెన్నైలో ఈమేరకు సమాధానం ఇచ్చారు.

ఉపఎన్నికలే కీలకం...

తమిళనాడు శాసనసభ సభ్యుల సంఖ్య 234. స్పీకరును మినహాయిస్తే అధికార అన్నాడీఎంకేకు ప్రస్తుతం 113 మంది శాసనసభ్యులున్నారు. అధికారంలో కొనసాగాలంటే సాధారణ మెజారిటీ 117 మంది సభ్యులు కావాలి.

ఈనెల 18న 18 శాసనసభ స్థానాలకు ఉపఎన్నిక జరిగింది. మరో 4 స్థానాలకు మే 19న పోలింగ్​. ఈ 22 నియోజకవర్గాల ఫలితంపై తమిళ రాజకీయ భవిష్యత్​ ఆధారపడి ఉంది.

రాజకీయ ప్రవేశంపై రజినీకాంత్​ ప్రకటన చేసి చాలా కాలమైంది. కానీ... పార్టీపై ఎలాంటి ముందడుగు వేయలేదు. 2021లో జరిగే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తామని 2017 డిసెంబర్​లో ప్రకటించారు సూపర్​స్టార్​.

ABOUT THE AUTHOR

...view details