మధ్యప్రదేశ్ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో గవర్నర్ లాల్జీ టాండన్‌ను కలిశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్. బల పరీక్షకు తాము సిద్ధమని తెలిపారు.
రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం గురించి గవర్నర్‌కు పూర్తిగా వివరించారు కమల్‌నాథ్. అనైతికంగా తమ పార్టీకి చెందిన 22 మందిఎమ్మెల్యేలను భాజపా బెంగళూరులో బంధించినట్లు పేర్కొన్న లేఖను గవర్నర్‌కు సమర్పించారు.
మార్చి16న ప్రారంభమయ్యే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో బలపరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు కమల్‌నాథ్ పేర్కొన్నారు. ఈ నెల 3 ,4,10 తేదీల్లో జరిగిన రాజకీయ పరిణామాలను గవర్నర్‌కు లేఖలో వివరించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సింధియా వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ రోజు బెంగళూరు నుంచి భోపాల్ వచ్చి స్పీకర్‌కు రాజీనామా పత్రాలను అందజేయనున్నారని భాజపా వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:మధ్యప్రదేశ్‌లో 'కమల్' సర్కార్ బలపరీక్షకు వేళాయే..!