తెలంగాణ

telangana

'ఆర్​సీఈపీ- రైతుల పాలిట విధ్వంస ఒప్పందం'

By

Published : Nov 2, 2019, 7:21 PM IST

Updated : Nov 2, 2019, 8:53 PM IST

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్​సీఈపీ) ఒప్పందంపై భారత్​ సంతకం చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆర్​సీఈపీ ఒప్పందం చేసుకుంటే అది దేశీయ రైతుల పాలిట విధ్వంస ఒప్పందం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక మందగమన సమయంలో భారత విపణులు రైతులకు అండగా నిలవాలని సూచించారు ప్రియాంక.

ఆర్​సీఈపీ రైతుల పాలిట విధ్వంస ఒప్పందం: ప్రియాంకగాంధీ

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్​సీఈపీ) ఒప్పందంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. భారత్ ఒకవేళ ఆర్​సీఈపీ ఒప్పందంపై సంతకం చేస్తే అది 'రైతుల పాలిట విధ్వంస ఒప్పందం' అవుతుందని అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ సమయంలో భారత విపణులు దేశీయ రైతులకు చేయగలిగినంత సాయం చేయాలి. భారత్​ ఆర్​సీఈపీ ఒప్పందంపై సంతకం చేస్తే.. అది దేశ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశాలు సన్నగిల్లుతాయి."
- ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఆర్​సీఈపీ రైతుల పాలిట విధ్వంస ఒప్పందం

దిల్లీలో నిరసన

ఆర్​సీఈపీలో భారత్ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ యూత్​ కాంగ్రెస్ సభ్యులు, కార్మికులు.. దిల్లీలోని కేంద్రమంత్రి గిరిరాజ్​ నివాసం ముందు నిరసన చేపట్టారు. పాడి పరిశ్రమను ఆర్​ఈసీపీలో చేర్చడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

స్వేచ్ఛావాణిజ్యం కోసం

10 సభ్యదేశాల ఆసియాన్ కూటమి సహా భారత్​, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్​సీఈపీ) దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. 2012 నవంబర్​లో కంబోడియా రాజధాని నామ్​పెన్​లో జరిగిన 21వ ఆసియాన్​ సదస్సులో దీనికి అంకురార్పణ జరిగింది.

భారత ప్రయోజనాల మేరకే..

మూడు రోజుల పాటు థాయిలాండ్​ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వార్షిక ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా సదస్సులతో పాటు 'ఆర్​సీఈపీ' సదస్సులోనూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో భారత వాణిజ్యానికి సంబంధించి వస్తువులు, సేవలు, పెట్టుబడులకు సంబంధించిన అన్నీ మనకు కేటాయిస్తేనే.. కూటమిలో చేరే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. భారత్​ తూర్పు విదేశాంగ విధానానికి కీలకంగా ఉన్న ఆర్​సీఈపీ​పై ఆచితూచి వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:'మహా'పీఠం: శివసేనకు కాంగ్రెస్​ మద్దతుపై కొత్త చర్చ

Last Updated : Nov 2, 2019, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details