ఆర్సీఈపీ ఒప్పందంపై భారత్ సంతకం చేస్తే రైతులు, దుకాణదారులు నష్టపోతారని, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు కష్టాలు ఎదురవుతాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్సీఈపీ) ఒప్పందంలో భారత్ భాగస్వామి అవుతుందన్న వార్తల నేపథ్యంలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిల్లీలోని ఐఏసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సోనియా. దేశం ఆర్థిక మందగమనంలో ఉన్న నేపథ్యంలో ఆర్సీఈపీ ఒప్పందంలో భాగస్వామి కావడం భారత్కు చాలా నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
"దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉంది. ఈ సమస్యను గుర్తించి పరిష్కరించే ప్రయత్నం కేంద్రప్రభుత్వం చేయాలి. అయితే ప్రధాని మోదీ.. వార్తలో నిలిచే కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఒక పౌరురాలిగా దేశ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇంత కంటే ఆందోళనకర విషయం ఏంటంటే సమస్యపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉండటం." - సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
భాజపా- గూఢచర్యం..