తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భయం, అభద్రతా భావంతో దేశ ప్రజలు' - rahul latest updates

దేశ ప్రజల మానసిక స్థితిని ఆర్బీఐ వెల్లడించిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని.. భయం, అభద్రతా భావం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయని ట్వీట్​ చేశారు. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలకు సంబంధించి ఇంకా బాధాకరమైన వార్తలు వినాల్సి ఉంటుందని హెచ్చరించారు.

RBI reveals nation's mood: Rahul
'దేశ ప్రజల మానసిక స్థితిని ఆర్బీఐ వెల్లడించింది'

By

Published : Aug 7, 2020, 6:45 PM IST

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల విశ్వాసం అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. ద్రవ్యపరపతి విధాన ప్రకటనను ఉద్దేశిస్తూ... ప్రజల మానసిక స్థితిని ఆర్బీఐ వెల్లడించిందని ట్వీట్​ చేశారు.

" భారతదేశ వాస్తవ స్థితిని ఆర్బీఐ వెల్లడించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. భయం, అభద్రతా భావంతో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలకు సంబంధించి ఇంకా బాధాకరమైన వార్తాలు వినాల్సి రావచ్చు."

-రాహుల్​ ట్వీట్​.

ప్రజల విశ్వాసం ఏ స్థాయిలో పడిపోతోందో తెలిపే ఓ గ్రాఫ్​ను ట్వీట్​కు జత చేశారు రాహుల్​.

ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీరేట్లలో మార్పులు చేయడం లేదని గురువారం ప్రకటించింది ఆర్బీఐ. కరోనా సంక్షోభం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీన స్థితిలో ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి: 'నవ భారత్​ నిర్మాణానికి కొత్త విద్యా విధానమే పునాది'

ABOUT THE AUTHOR

...view details