భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా పదవీకాలం ఈ నెలాఖరులోగా ముగియనుండగా తన బాధ్యతలను ఆయన నేడు రావత్‌కు అప్పగించనున్నారు.
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీలో త్రివిధ దళాల చీఫ్‌లు సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యంత సీనియర్‌ను కమిటీకి ఛైర్మన్‌గా నియమిస్తారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం సహా దేశభద్రత విషయంలో ఎదురయ్యే సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొనే అంశంలో కమిటీ ఛైర్మన్ కీలకంగా వ్యవహరిస్తారు.