తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈవీఎంలపై కాంగ్రెస్​-భాజపా మాటల యుద్ధం - VVPAT

ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ యంత్రాలు భాజపా విజయ యంత్రాలుగా మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత అభిషేక్​ మను సింఘ్వీ. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయని ట్విట్టర్​లో దీటుగా బదులిచ్చారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా.

ఈవీఎంలపై కాంగ్రెస్​-భాజపా మాటల యుద్ధం

By

Published : May 22, 2019, 8:09 PM IST

వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంల కౌంటింగ్​కు ముందే లెక్కించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు సుముఖంగా లేదో చెప్పాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్​ మను సింఘ్వీ. ఈవీఎంలపై విశ్వసనీయత కోల్పోకుండా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు సింఘ్వీ.

మీడియాతో మాట్లాడుతున్న సింఘ్వీ

"ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇప్పుడు మోదీ ప్రచార నియమావళిగా ఎందుకు మారింది?. ఈవీఎంలపై విశ్వసనీయతకు చర్యలు తీసుకోకుండా భాజపా విజయ యంత్రాలుగా మారుస్తారా?. ఎలక్షన్​ కమిషన్​ అసమర్థ కమిషన్​గా తయారయ్యింది."
-అభిషేక్​ మను సింఘ్వీ, కాంగ్రెస్ సీనియర్ నేత

ఓటమి భయంతోనే ఈవీఎంలపై ఆరోపణలు: షా

కాంగ్రెస్​ ఆరోపణల్ని తిప్పికొట్టారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ట్విట్టర్​లో స్పందించారు. అన్ని పార్టీల ఏకాభిప్రాయం లేకుండా వీవీప్యాట్​ స్లిప్పులను లెక్కించే నిబంధనల్ని మార్చడం ఈసీకి కుదరదన్నారు.

"ఈవీఎంల పనీతీరును ప్రశ్నించడమంటే ప్రజల నిర్ణయాన్ని అగౌరవపరచడమే. ప్రతిపక్షాలు గతంలో ఈ విధానం ద్వారానే అధికారంలోకి వచ్చాయి." అని వరుస ట్వీట్లు చేశారు షా.

ఇదీ చూడండి: నిగూఢ రహస్యాల అడ్డాగా ఈసీ: కాంగ్రెస్​

ABOUT THE AUTHOR

...view details