తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుదైన పసుపు రంగు తాబేలు ఇదిగో - కలర్​ఫుల్​ టార్టాయిస్​

పసుపు రంగులో మెరిసిపోతున్న ఓ తాబేలు.. పశ్చిమ్​ బంగా​లో దర్శనమిచ్చింది. తర్వాత దాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జన్యు సంక్రమణలతోనే తాబేలు వర్ణంలో తేడా వచ్చిందని తెలిపారు.

Rare yellow tortoise rescued in East Burdwan
అరుదైన పసుపు రంగు తాబేలు ఇదిగో

By

Published : Oct 30, 2020, 10:30 AM IST

అరుదైన పసుపు రంగు తాబేలును బంగాల్​ తూర్పు బుర్ద్వాన్​లోని కలిగ్రామ్​ దాస్​పుర ప్రాంతంలో గుర్తించారు. అనంతరం దాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ అటవీ సేవల అధికారి దెబాషిస్​ శర్మ ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా తెలిపారు. ఆ తాబేలు చిత్రాన్ని పంచుకున్నారు.

జన్యుపరమైన మార్పులతో లేదా పుట్టుకతో వచ్చే వ్యాధుల వల్ల ఇలా రంగుల్లో మార్పులు వస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో రెండు పసుపు తాబేళ్లను అధికారులు గుర్తించారు. అంతకుముందు జులై నెలలో ఒడిశాలోని బాలేశ్వర్​లో ఒక కూర్మాన్ని పట్టుకున్నారు.

అరుదైన పసుపు రంగు తాబేలు ఇదిగో

ఇదీ చూడండి:మంత్రాల నెపంతో ఒకే కుటుంబంలోని ముగ్గురి శిరచ్ఛేదం

ABOUT THE AUTHOR

...view details