తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడేళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

ఎముకల క్యాన్సర్​తో బాధపడుతున్న ఓ బాలుడికి అరుదైన శస్త్రచికిత్స చేశారు కర్ణాటక మంగళూరుకు చెందిన వైద్యులు. 10గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

By

Published : May 27, 2020, 5:26 PM IST

Rare surgery for bone cancer performed at Indiana Hospital, Mangalore saves a child's hand
ఏడేళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

ఎముకల క్యాన్సర్​తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స చేసి అతడి ప్రాణాలను కాపాడారు కర్ణాటక మంగళూరులోని ఇండియానా ఆసుపత్రికి చెందిన వైద్యులు. శస్త్రచికిత్సలో భాగంగా అతడి భుజాన్ని తొలగించారు.

బాలుడు గత కొంతకాలంగా ఎముకల క్యాన్సర్​తో బాధపడుతున్నాడు. క్యాన్సర్​ వల్ల భుజం భాగంలో వాపు రావటం వల్ల ..రాత్రి సమయంలో అతడికి విపరీతమైన నొప్పి వచ్చేది. క్రమంగా అతడి చేతి భాగము పూర్తిగా పని చేయకుండా పోయింది.

తొలుత ఆ బాలుడికి 10 వారాల పాటు కీమోథెరఫీ చికిత్సను అందించారు ఇండియానా ఆస్పత్రి వైద్యులు. అయితే ఎటువంటి మార్పు లేకపోయే సరికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. దాదాపు 10 గంటల పాటు శ్రమించి ఆ బాలుడి భుజాన్ని పూర్తిగా తొలగించారు.

వాపు ఉన్న భాగంలో కణితిని నాశనం చేయటానికి మైనస్​ 194 డిగ్రీల సెల్సియస్​తో కూడిన నైటోజన్​ ద్రావణాన్ని పంపించి దాన్ని గడ్డ కట్టించారు. అనంతరం కణాలను నాశనం చేశారు. శస్త్ర చికిత్స అనంతరం బాలుడు కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.

" ఈ విజయంతో ఎముకలు, కణజాల కణితితో బాధపడే వారికి శస్త్రచికిత్స చేసే కేంద్రంగా మంగళూరు మారుతుంది."

-యూసఫ్​ కుంబ్లే, ఇండియానా ఆసుపత్రి మేనేజింగ్​ డైరెక్టర్

ఇదీ చూడండి:హత్య కేసులో పాముకు శవపరీక్షలు.. తేలిందేంటంటే!

ABOUT THE AUTHOR

...view details