ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని గంగోత్రి జాతీయ ఉద్యానవనంలో అరుదైన 'మంచు చిరుత' జంట సంచరించింది. పిల్లి జాతికి చెందిన ఈ పులులు మధ్య, దక్షిణాసియాలో 3000 నుంచి 4000 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య 10 వేల కంటే తక్కువే. అరుదైన ఈ జాతి చిరుతలను అంతరించిపోయే జీవుల జాబితాలో చేర్చింది అంతర్జాతీయ సహజవనరుల పరిరక్షణ సమాఖ్య.
ఉత్తరకాశీలో అరుదైన మంచు చిరుతలు కనువిందు - Snow Leopards Spotted In Uttarkashi's Gangotri National Park
ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి జాతీయ ఉద్యానవనంలో అరుదైన మంచు చిరుతలు కనిపించాయి. ప్రస్తుతం ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా ఉన్నాయి.
![ఉత్తరకాశీలో అరుదైన మంచు చిరుతలు కనువిందు Rare Snow Leopards Spotted In Uttarkashi's Gangotri National Park](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8885298-827-8885298-1600695548136.jpg)
ఉత్తరకాశీలో అరుదైన మంచు చిరుతలు కనువిందు
వీటి కోసం భారతదేశంలో మొట్టమొదటి మంచు చిరుత సంరక్షణ కేంద్రం ఉత్తరకాశీ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇక్కడ అంతరించిపోతున్న ఇతర వన్యప్రాణులు వూలీ ఫ్లయింగ్ స్క్విరల్, యురేషియన్ లింక్స్ (అడవి పిల్లులు), అడవి కుక్కలు ఉంటాయి.