ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్ పరిధిలో మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. అభం, శుభం తెలియని ఆ చిన్నారి శుక్రవారం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. అదే వీధికి చెందిన యువకుడు ఆమెను పక్కన ఉన్న పొలంలోకి లాక్కెళ్లాడు. పాప అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని.. చిన్నారిని కాపాడారు.
3 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం.. కాపాడిన స్థానికులు - unnao latest news
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ పరిధిలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. ఇప్పటికే 'ఉన్నావ్ బాధితురాలు' మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతోన్న వేళ.. అదే చోట ఈ దారుణం జరగడం గమానార్హం.
3 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం.. కాపాడిన స్థానికులు
స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చిన్నారిని వైద్య పరీక్షలకు తరలించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: వారి మరణమే నాకు ఓదార్పు: ఉన్నావ్ బాధితురాలి తండ్రి
Last Updated : Dec 7, 2019, 2:54 PM IST