తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియాంక గాంధీ వాట్సాప్​ ఖాతా హ్యాక్​!

ప్రియాంక గాంధీకి చెందిన వాట్సప్​ ఖాతా హ్యాకింగ్​కు గురైనట్లు కాంగ్రెస్​ వెల్లడించింది. ఈ మేరకు వాట్సాప్​ నుంచి సంక్షిప్త సందేశం అందినట్లు పేర్కొంది. అక్రమ స్పైవేర్​ను భాజపా ప్రభుత్వమే అమలు చేస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

ప్రియాంక గాంధీ వాట్సాప్​ ఖాతా హ్యాక్​!

By

Published : Nov 3, 2019, 5:18 PM IST

కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాట్సాప్​ ఖాతా హ్యాకింగ్​కు గురైంది. ఈ మేరకు వాట్సాప్​ నుంచి సంక్షిప్త సందేశం అందినట్లు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా వెల్లడించారు. హ్యాకింగ్​కు గురైన ఖాతాదారుల ఫోన్లకు సందేశాలు పంపుతున్న క్రమంలో.. ప్రియాంక గాంధీకి ఈ సందేశం వచ్చినట్లు పేర్కొన్నారు.

ఇజ్రాయెల్​కు చెందిన స్పైవేర్​ పెగసస్​.. భారతీయ పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తలే లక్ష్యంగా సమాచార చోరీకి పాల్పడినట్లు వాట్సాప్​ గత గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఖాతా హ్యాకింగ్​కు గురుకావటం ప్రాధాన్యం సంతరించుకుంది.

భాజపాపై విమర్శలు..

స్పైవేర్​ పెగసస్​ ద్వారా మొబైల్​ ఫోన్​లను అక్రమంగా, రాజ్యాంగ విరుద్ధంగా హ్యాకింగ్​ చేయటంలో భాజపా ప్రభుత్వ కుట్ర ప్రతిరోజూ తేటతెల్లమవుతోందని విమర్శించారు సుర్జేవాలా. ఈ అక్రమ స్పైవేర్​ రాకెట్​ను భాజపా ప్రభుత్వమే అమలు చేస్తోందన్నారు. వ్యక్తిగత గోప్యత హక్కు అనేది మోదీ ప్రభుత్వానికి హాస్యంగా మారిందని విమర్శిస్తూ ట్వీట్​ చేశారు. ​

సుర్జేవాలా ట్వీట్​

ఇదీ చూడండి: వాట్సాప్​ డేటాను చోరీ చేసిన ఇజ్రాయెల్​ స్పైవేర్​!

ABOUT THE AUTHOR

...view details