ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ ఏటా ఒక ప్రధాన వేదికను నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఈ ఏడాది ప్రధాన వేదికగా 'రాంచీ' ఎంపికైంది. నమో 2.0 ప్రభుత్వం మొదటిసారిగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు.
యోగా మహోత్సవ ప్రధాన వేదికగా 'రాంచీ' - ప్రధాన వేదిక
ప్రపంచ యోగా దినోత్సవ ప్రధాన వేదికగా రాంచీని ఎంపిక చేసింది ప్రధానమంత్రి కార్యాలయం. జూన్ 21న జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు.
యోగా మహోత్సవ ప్రధాన వేదికగా 'రాంచీ' ఎంపిక
అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే ప్రధాన వేదికను ఎంపిక చేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం ఐదు నగరాల పేర్లను పరిశీలించింది. దిల్లీ, సిమ్లా, మైసూర్, అహ్మదాబాద్, రాంచీలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో నుంచి తాజాగా రాంచీని ఎంపిక చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: యోగా దినోత్సవం ప్రధాన వేదిక ఎక్కడంటే...
Last Updated : Jun 2, 2019, 7:49 PM IST