రామమందిర శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా అయోధ్యలో మంగళవారం 'రామార్చన పూజ' నిర్వహించారు అర్చకులు. వేదమంత్రాలను జపిస్తూ పూజలు చేశారు. భూమిపూజ కోసం తరలి రావాలని దేవుళ్లు, దేవతలను ఆహ్వానించడానికి ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు పేర్కొన్నారు అర్చకులు.
అయితే ఈ రామార్చన పూజ మొత్తం నాలుగు దశల్లో ఉంటుందని అర్చకులు తెలిపారు.
తొలి దశ:-రాముడు మినహా ఇతర దేవతలను పూజిస్తారు. శంకుస్థాపన మహోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానిస్తారు.
రెండోవ దశ:- అయోధ్య నగరంతో పాటు రాముడి సైన్యాధికారులైన నలుడు, నీలుడు, సుగ్రీవుడిని పూజిస్తారు.
మూడో దశ:- దశరథుడు, ఆయన ముగ్గురు భార్యలతో పాటు రాముడి సోదరులను పూజిస్తారు.
నాలుగో దశ:- రాముడిని పూజిస్తారు.
వేదమంత్రాలు ఉచ్చరిస్తున్న అర్చకులు ఇదీ చూడండి:-అయోధ్య ఉద్యమానికి ఊపిరి పోసింది వీరే...
లడ్డూల పంపిణీ...
భూమిపూజ నేపథ్యంలో లక్షకుపైగా లడ్డూలను పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతోంది బిహార్ పట్నాలోని మహావీర్ మందిర్ ట్రస్ట్. ఈ లక్ష 'రఘుపతి లడ్డు'ల్లో 51వేల లడ్డూలను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందివ్వనుంది. మిగిలినవి ఇతర ప్రసిద్ధ ప్రాంతాలకు పంపించనుంది.
భద్రత కట్టుదిట్టం..
మరోవైపు బుధవారం జరగనున్న రామమందిర భూమిపూజ కోసం అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఇప్పటికే పోలీసులు నగర వీధుల్లో భారీ స్థాయిలో గస్తీకాస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
అయోధ్యలో కట్టుదిట్ట భద్రత అయోధ్యలో కట్టుదిట్ట భద్రత ఇవీ చూడండి:-