తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మకర సంక్రాంతి వేళ.. 'తిల్​కుట్​' ఘుమఘుమలాడేనిలా! - sankranti special tilkut inn bihar

సంక్రాంతి వచ్చేస్తోంది.. ఎప్పటిలాగానే బిహార్ వీధులన్నీ 'తిల్​కుట్'​ సువాసనలతో పరిమళిస్తున్నాయి..అయితే ఈ సారి ఒక్కటి కాదు తీరొక్క తిల్​కుట్​లు స్థానికుల నోళ్లు తీపి చేస్తున్నాయి. ఎంత ఖరీదైనా సరే.. వెంటనే రుచి చూసేయాలనేలా ఊరిస్తున్నాయి. ఇంతకీ ఈ 'తిల్​కుట్​' ఏంటీ? తిల్​కుట్​కు సంక్రాంతికి సంబంధమేమిటి?

Ramana Road Tilkut The unmatched taste of Gaya, bihar
మకర సంక్రాంతి వేళ.. 'తిల్​కుట్​' ఘుమఘుమలాడేనిలా!

By

Published : Jan 13, 2020, 7:01 AM IST

Updated : Jan 13, 2020, 8:03 AM IST

మకర సంక్రాంతి వేళ.. 'తిల్​కుట్​' ఘుమఘుమలాడేనిలా!

బిహార్​ గయాలో మకర సంక్రాంతి నెలలో మాత్రమే దొరికే ప్రత్యేక మిఠాయి 'తిల్​కుట్​' ఈ సారి వివిధ ఫ్లేవర్లలో నోరూరిస్తోంది. ఏటా గయాలో మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. పండుగ రోజున ప్రతి ఇంట్లో చుడా, పెరుగు, తిల్​కుట్​ మిఠాయిలు పక్కాగా ఉండాల్సిందే. పర్వదినాన ఈ మూడు మిఠాయిలు తినడం వల్ల శుభాలు కలుగుతాయనేది ఇక్కడి వారి నమ్మకం. అయితే.. నువ్వులు, బెల్లం లేదా చక్కెరా కలిపి చేసే తిల్​కుట్ మాత్రం బిహార్​కే ప్రత్యేక పేరు తెచ్చిపెట్టింది.

ఒక్కసారి తిల్​కుట్​ రుచి చూస్తే వదిలిపెట్టలేరంటారు ఉత్తరాది వాసులు. అందుకే బిహార్​లో తయారయ్యే ఈ ​మిఠాయిలు.. ఝార్ఖండ్, పశ్చిమ బంగాల్​, దిల్లీ, మధ్యప్రదేశ్​, మహారాష్ట్రాకూ ఎగుమతి అవుతాయి.

150 ఏళ్ల చరిత్ర...

గయాలోని రమణ రోడ్డు కరకరలాడే తిల్​కుట్లకు ప్రసిద్ధి. సంక్రాంతికి నెల, రెండు నెలల ముందు నుంచే.. తిల్​కుట్​ సువాసనలతో నిండుపోతందీ ప్రాంతం. ఇక్కడి తిల్​కుట్లకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఏళ్ల క్రితం గోపీ షా అనే వ్యాపారి ఇక్కడ తిల్​కుట్లు విక్రయించడం ప్రారంభించాడు. ఆయన వంశస్థులు వినూత్నతను జోడించి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే.. ఈ సారి రమణ రోడ్డులో తిల్​కుట్లు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తిల్​కుట్​ తయారీలో నైపుణ్యం సాధించినవారిని పిలిపించి మరీ కొత్త రకం తిల్​కుట్లు తయారు చేయిస్తున్నారు దుకాణ దారులు. రకరకాల ఆకారాలు, వివిధ ఫ్లేవర్లలో ఘుమఘుమలాడుతూ.. వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

"ఇక్కడ ఎన్నో రకాల తిల్​కుట్లు ఉన్నాయి. ఇందులో పాపడీ, చక్కర, బెల్లం, కోవాతో చేసినవి ఉన్నాయి. ఈ సారి ఇవన్నీ చాలా రుచిగా ఉన్నాయి. ధర కాస్త ఎక్కువుంది కానీ... నాణ్యమైన తిల్​కుట్లు దొరుకుతాయి."

-రమేశ్​ సాహ్​, స్థానికుడు

దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా తిల్​కుట్​లో వినియోగించే కువా, గ్వాలియర్​ వంటి ఖరీదైన వస్తువుల వల్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. అందుకే మార్కెట్లో తిల్​కుట్​ ధరలు పెరిగిపోయాయి.

సంక్రాంతి సీజన్​లో..

ఉత్తరాదిలో సాంస్కృతిక నగరంగా పిలిచే గయా.. కాలానుగుణ మిఠాయిలకు ప్రసిద్ధి. వర్షాకాలంలో 'అనర్సా' ఎండాకాలంలో 'లై'.. శీతాకాలంలో 'తిల్​కుట్'​.

భారతీయులు సాధారణంగానే నువ్వులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. శరీరంలో వేడిని పుట్టించే ఈ చిరుధాన్యం చలికాలంలో సహజ ఔషధంగా పనిచేస్తుంది. అందుకే చలికాలంలో వచ్చే మకర సంక్రాంతి నాడు నువ్వులు తిన్నా, దానం చేసినా మంచిదంటారు పెద్దలు.

అందుకే బిహార్​లో కట్టెలపోయ్యిపై నువ్వులు, చక్కెర, బెల్లం కలిపి చేసే ఈ తిల్​కుట్..​ సంప్రదాయ వంటకంగా మారింది.

ఇదీ చదవండి:ప్రపంచంలోనే తొలి 'చిల్డ్రన్​ న్యూట్రిషన్​ పార్క్'

Last Updated : Jan 13, 2020, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details