కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాసవాన్ గుండెకు దిల్లీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆయన కుమారుడు, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో మరో శస్త్రచికిత్స చేసే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాసవాన్‌కు శస్త్రచికిత్స - బిహార్ పోలింగ్ 2020
కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాసవాన్ గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ మేరకు ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ ట్వీట్ చేశారు. అనారోగ్యంతో కొన్నిరోజులక్రితం ఆస్పత్రిలో చేరారు కేంద్రమంత్రి.
కేంద్ర మంత్రి రాం విలాస్ పాసవాన్‌కు శస్త్రచికిత్స
"కొద్ది రోజులుగా నా తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. అవసరమైతే కొద్ది రోజుల్లో మరో ఆపరేషన్ చేసే అవకాశం ఉంది. కష్టకాలంలో నా కుటుంబానికి నాకు అండగా ఉన్నవారికి కృతజ్ఞతలు."
- చిరాగ్ పాసవాన్, ఎల్జేపీ అధ్యక్షుడు