కేంద్ర మంత్రి, ఎల్జేపీ అగ్రనేత రామ్‌విలాస్ పాసవాన్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం దిల్లీలోని ఓ ఆసుపత్రిలో గుండెకు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. తండ్రి మృతిని ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ ధ్రువీకరించారు.
కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాసవాన్ అస్తమయం - రామ్‌విలాస్ పాసవాన్ మరణం
కేంద్ర మంత్రి, ఎల్జేపీ అగ్రనేత రామ్‌విలాస్ పాసవాన్ కన్నుమూశారు. తండ్రి మరణాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ ధ్రువీకరించారు.
రామ్‌విలాస్ పాసవాన్
పాసవాన్ 5 దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. దేశంలోని ప్రముఖ నేతల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఉన్నారు.