అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు.. దిల్లీలో బుధవారంతొలిసారి సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలను ట్రస్టు సభ్యులు చర్చించనున్నారు. రామ మందిర నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించడం, మందిర నిర్మాణానికి ప్రజల నుంచి పారదర్శకంగా విరాళాల సేకరణ, భవిష్యత్తు కార్యచరణ వంటి కీలక అంశాలు సమావేశ అజెండాగా ఉన్నాయి.
వివాదాలు లేకుండా విరాళాలు..
నిర్ణీత సమయంలోగా రామ మందిరాన్ని నిర్మించాలని ట్రస్టు ఆశిస్తోంది. ఇందుకు కాలవ్యవధిని నిర్ణయించనున్నారు. అంతేకాకుండా మందిరాన్ని ప్రజల నుంచి విరాళాలు ఏ విధంగా సేకరించాలన్న దానిపైనా చర్చించనున్నారు. విరాళాలు సేకరించే సమయంలో ఎలాంటి వివాదాలకు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ సభ్యులు దృష్టి సారించనున్నారు.
రాంలల్లా విగ్రహ ప్రతిష్ఠ..