అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగి నెల రోజులు పూర్తయింది. అయినప్పటికీ నిర్మాణ కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదు. తాజాగా.. ఈ విషయంపై కొంత స్పష్టత వచ్చింది. ఈ నెల 17తో పితృ పక్షాలు పూర్తవుతాయని.. ఆ తర్వాత రామమందిర నిర్మాణ పనులు మొదలవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.
హిందువులు తమ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలుపుకుని, వారిని గుర్తుతెచ్చుకునే కాలాన్నే పితృ పక్షాలు అని అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలను జరుపుకోరు.
ఇదీ చూడండి:-మోదీ కార్యక్రమాల్లో 'అయోధ్య భూమిపూజ' టాప్