ఆయోధ్యలో రామ మందిర నిర్మాణం త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంగీకరించిన తేదీని ఖరారు చేసేందుకు శనివారం అయోధ్యలో సమావేశం కానున్నారు.
"ప్రధాని మోదీకి ఆహ్వానం పంపించాం. శనివారం జరిగే సమావేశంలో ఆలయ నిర్మాణం ప్రారంభించే తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ తేదీని ప్రకటిస్తారు."
- శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు
ఈ సమావేశానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ కూడా హాజరు కానున్నారని ట్రస్టు సభ్యులు తెలిపారు.
ఆగస్టులో ప్రారంభం!
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఆగస్టులో ప్రారంభం కావచ్చని సమాచారం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి చాలా కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా ప్రధాని మోదీ, మోహన్ భగవత్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా కొద్ది మంది మంత్రులు మాత్రమే హాజరవుతారని సమాచారం.
'శిలన్యాసం' మామూలే..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిలంగ్ ద్వారలో శిలన్యాస కార్యక్రమం జరిగిందని... అయితే ఇది మామూలు కార్యక్రమం మాత్రమేనని ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి గర్భ గృహం వద్ద భూమి పూజ నిర్వహించడమే అసలైన వేడుక అని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:లద్దాఖ్‌లో రక్షణ మంత్రి- క్షేత్రస్థాయి పరిశీలన