తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ సర్కార్​కు 'ఆగస్టు 5' ఎందుకింత ప్రత్యేకం?

అయోధ్యలో రామ మందిరానికి ఆగస్టు 5న భూమిపూజ జరగనుంది. ఇప్పటికే ఇదే రోజున మోదీ సర్కార్​ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఆర్టికల్​ 370 రద్దు, మొఘల్​సరాయ్ రైల్వేస్టేషన్​ పేరు మార్పు వంటివి ఉన్నాయి.

Ram Temple, Art 370, Mughalsarai: August 5 seems to be auspicious for BJP
ఆగస్టు 5 అంటే బీజీపేకి అంత శుభదినమా...?

By

Published : Aug 4, 2020, 6:00 PM IST

ఏదైనా శుభకార్యం చేసేముందు రోజు, ముహూర్తం చూడటం భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. వాటికి మరింత విలువనిచ్చే నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్​డీఏ సర్కార్​కు ఆగస్టు 5 చాలా ముఖ్యమైన రోజు. ఇదే తారీఖున పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మోదీ ప్రభుత్వం. అవేంటంటే..?

రామ మందిరం భూమిపూజ..

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ ఆగస్టు 5నే. దాదాపు 500 ఏళ్లుగా ఉన్న ఈ భూవివాదం ఇక ముగిసిపోనుంది. ఎన్నో ఏళ్ల నాటి గొడవలు గతేడాది సుప్రీం తీర్పుతో సద్దుమణిగాయి. ఫలితంగా రామ మందిరం నిర్మాణానికి గ్రీన్​ సిగ్నల్​ పడింది. ఇప్పుడు ఇదే ప్రాంతంలో మోదీ శంకుస్థాపన చేయనున్నారు. తమకు బాగా కలిసొచ్చిన ఆగస్టు 5వ తేదీనే కాషాయదళం ఈ మహత్కార్యానికి పూనుకొంటోంది.

ఆర్టికల్​ 370 రద్దు...

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి అధికారం ఇచ్చిన ఆర్టికల్​ 370ని ఇదే రోజున రద్దు చేశారు. గతేడాది ఈ నిర్ణయం తీసుకున్నారు. జమ్ము కశ్మీర్​, లద్ధాఖ్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది మోదీ సర్కార్​. ఈ నిర్ణయంతో ఒకటే దేశం-ఒకటే రాజ్యంగం అమలు చేయాలన్న భాజపా ఆకాంక్ష నెరవేరింది.

మొగల్​సరాయ్​ స్టేషన్​ పేరు మార్పు...

ఉత్తరప్రదేశ్​ చందౌలీ జిల్లాలోని మొగల్​సరాయ్​ రైల్వే స్టేషన్ పేరు మార్చింది ఆగస్టు 5నే. ఇది ఆసియాలోని అతిపెద్ద రైల్వేయార్డుగా పేరు తెచ్చుకుంది. దాన్ని 2018లో పండిట్​ దీన్​ దయాల్​ ఉపాధ్యాయ రైల్వేస్టేషన్​గా మార్పు చేశారు. ఉత్తరప్రదేశ్​లో యోగి ప్రభుత్వం ఏర్పడ్డాక నూతన పేరును ప్రతిపాదించగా.. కేంద్రం ఆమోదించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున...

  • ఆగస్టు 5, 1945: జపాన్​లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది.
  • ఆగస్టు 5, 1890: చంద్రుడిపై మొట్టమొదటిసారి అడుగుపెట్టిన నీల్​ఆర్మ్​స్ట్రాంగ్ పుట్టిన రోజు.
  • ఆగస్టు 5, 2011: మార్స్​పై నీరు ఉందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటన చేసింది ఈరోజే.
  • ఆగస్టు 5, 2011: బృహస్పతిని అధ్యయనం చేయడానికి నాసా అంతరిక్ష నౌకను పంపించింది.

ప్రపంచ రాజకీయం, పరిశోధనలు, ఆవిష్కరణల్లో కీలక ఘట్టాలకు ఆగస్టు 5 నాంది పలికింది. అలాంటి రోజునే భారత్​ కూడా ఆర్టికల్​ 370ని రద్దు చేసింది. ఇప్పుడు రామ మందిరానికి భూమిపూజ చేసేందుకు సిద్ధమైంది.

ABOUT THE AUTHOR

...view details