తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీజీ అయోధ్యను సందర్శించండి: ట్రస్ట్​ ఛైర్మన్​ - మోదీ

రామ మందిరం ట్రస్ట్‌ సభ్యులు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. తొలిభేటీలో చర్చించిన అంశాలను.. ప్రధానికి వివరించారు.

Ram Mandir Trust members meet PM Mod
మోదీజీ అయోధ్యను సందర్శించండి: ట్రస్ట్​ ఛైర్మన్

By

Published : Feb 20, 2020, 8:12 PM IST

Updated : Mar 1, 2020, 11:58 PM IST

రామ మందిర ట్రస్ట్​ అధ్యక్షుడు నృత్య గోపాల్​ దాస్​ సహా సభ్యులంతా.. మోదీని ఆయన నివాసంలో కలిశారు. ట్రస్టు సభ్యులు తొలిసారి సమావేశమైన మరుసటి రోజే మోదీని కలవడం విశేషం.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో మోదీని అయోధ్య సందర్శించాలని కోరారు గోపాల్​ దాస్​.

అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్రంలో రామ మందిర నిర్మాణం పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ట్రస్ట్​ను ఏర్పాటు చేసింది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి, వీహెచ్​పీ నేత చంపత్​ రాయ్​, కోశాధికారి స్వామి గోవింద్​ దేవ్​ గిరి కూడా మోదీని కలిసిన బృందంలో ఉన్నారు.

ఇదీ చూడండి:దళిత యువకులపై విచక్షణారహితంగా దాడి

Last Updated : Mar 1, 2020, 11:58 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details