ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో నిర్మించబోయే రామాలయం ఎత్తు 161 అడుగులు ఉండాలని నిర్ణయించింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. 5 గోపురాలు ఉండాలని ఖరారు చేసింది. ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సభ్యులందరూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ట్రస్టు సభ్యులందరూ హాజరైన ఈ భేటీలో రామ మందిర నమూనా(డిజైన్) గురించి కూడా చర్చించారు. ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ట్రస్టు తెలిపింది.