సీనియర్ లాయర్ రామ్ జెఠ్మలానీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశం ఒక న్యాయకోవిదుడిని కోల్పోయిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. న్యాయస్థానాలు, పార్లమెంట్‌కు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల హక్కుల కోసం జెఠ్మలానీ చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
సీనియర్ న్యాయవాది జెఠ్మలానీ కన్నుమూత
10:08 September 08
జెఠ్మలానీ మృతి పట్ల మోదీ దిగ్భ్రాంతి
10:03 September 08
జెఠ్మలానీకి వెంకయ్యనాయుడు నివాళి
రామ్ జెఠ్మలానీకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను ఆరా తీశారు. దేశం గర్వించదగిన న్యాయ కోవిదుడని పేర్కొన్నారు వెంకయ్య.
09:43 September 08
రామ్ జెఠ్మలానీ మృతి పట్ల కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జెఠ్మలానీ గృహాన్ని సందర్శించి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఒక సీనియర్ న్యాయవాదిని మాత్రమే కాక... మానవత్వమున్న మంచి మనిషిని కోల్పోయామని పేర్కొన్నారు షా.
09:38 September 08
ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ మృతి
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. దిల్లీలోని స్వగృహంలో ఉదయం 7.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. 95 ఏళ్ల వయసున్న జెఠ్మలానీ గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కుమారుడు మహేశ్ వెల్లడించారు. లోధి రోడ్‌లోని శ్మశాన వాటికలో నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.
వాజ్‌పేయీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన జెఠ్మలానీ 1923 సెప్టెంబరు 14న అవిభజిత భారత్‌లోని సింధ్ ప్రావిన్స్ షికార్పూర్లో జన్మించారు. పలు ప్రముఖ కేసులను వాదించిన ఆయన ఎమర్జెన్సీ సమయంలో కీలకంగా వ్యవహరించి... జన్‌సంఘ్ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇప్పటివరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
09:33 September 08
09:07 September 08
సీనియర్ న్యాయవాది జెఠ్మలానీ కన్నుమూత
సీనియర్ లాయర్ రామ్ జెఠ్మలానీ కన్ను మూశారు. 95 ఏళ్ల జెఠ్మలానీ దిల్లీలోని స్వగృహంలో వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. స్వాతంత్య్రానికి పూర్వం అవిభజిత భారత్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో జన్మించారు. సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్‌గా ప్రసిద్ధులు. ఎమర్జెన్సీ సమయంలో కీలకంగా వ్యవహరించారు. జన్‌సంఘ్ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.