సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) చీఫ్‌గా గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాకేశ్ అస్థానా నియమితులయ్యారు. హోం మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి(అంతర్గత భద్రత)గా వీఎస్కే కౌముది నియామకం పొందారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు అస్థానా. వచ్చే ఏడాది జులై 31 వరకు బీఎస్ఎఫ్ చీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఏపీ కేడర్‌కు చెందిన...
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1986వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి వీఎస్కే కౌముదిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఈయన 2022 నవంబర్ 30 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
యూపీ నుంచి ఎండీ జావేద్ అక్తర్..
ఉత్తర్‌ప్రదేశ్ కేడర్ నుంచి కౌముది బ్యాచ్‌కే చెందిన ఎండీ జావేద్ అక్తర్.. ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోమ్‌గార్డ్ డీజీగా నియమితులయ్యారు. ఈయన 2021 జులై 21 వరకు ఆ స్థానంలో ఉండనున్నారు. ప్రస్తుతం ఆయన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) స్పెషల్ డీజీగా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి:మోదీ ఎఫెక్ట్: భారత్‌తో చర్చలకు చైనా సిద్ధం