దిల్లీ అల్లర్లపై ప్రతిపక్షాలు రాజ్యసభలో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. అంతకుముందు కరోనా వైరస్‌కు సంబంధించిన వివరాలను సభలో ప్రకటించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. అనంతరం దిల్లీ అల్లర్లపై విపక్ష సభ్యులు గళమెత్తారు. నినాదాలతో సభను హోరెత్తించిన సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు వెంకయ్య. ఇది పార్లమెంటు.. బజారు కాదని ఆగ్రహించారు. అనంతరం.. సభ కార్యకలాపాలు సాగే అవకాశం లేనందున రేపటికి వాయిదా వేశారు.
సభ్యుల తీరుపై వెంకయ్య అసహనం.. రాజ్యసభ వాయిదా - rs latest news
రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. కరోనా వైరస్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రసంగించిన అనంతరం దిల్లీ అల్లర్లపై నినాదాలు చేశారు విపక్ష సభ్యులు. ఈ ఆందోళనలపై మండిపడ్డారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. ఇది పార్లమెంటు, బజారు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభ్యుల తీరుపై వెంకయ్య అసహనం... రాజ్యసభ రేపటికి వాయిదా
సభ్యుల తీరుపై వెంకయ్య అసహనం.. రాజ్యసభ వాయిదా
మరోవైపు లోక్‌సభలోనూ దిల్లీ అలర్లపై విపక్షాలు గళమెత్తాయి. ఈ నేపథ్యంలో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
Last Updated : Mar 5, 2020, 1:57 PM IST