తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభలో 37 స్థానాలు ఏకగ్రీవం- 26న ఎన్నికలు - రాజ్యాసభ ఎన్నికలు

రాజ్యసభ ఎన్నికల నామినేషన్​ ఉపసంహరణ గడువు పూర్తయిన వేళ 37 మంది అభ్యర్థులకు ప్రత్యర్థులు లేరని రిటర్నింగు అధికారులు ప్రకటించారు. వీరంతా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 55 సీట్లలో మిగిలిన 18 స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.

RS-POLLS
పార్లమెంటు

By

Published : Mar 19, 2020, 5:36 AM IST

రాజ్యసభలో 37 స్థానాలు ఏకగ్రీవం

17 రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు నామినేషన్​ ప్రక్రియ పూర్తయింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్​ ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది.

55 స్థానాలకు గాను 37 మంది అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 18 స్థానాలకు మార్చి 26న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్​పవార్​, కేంద్ర మంత్రి రామ్​దాస్ అథవాలే, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్​ ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్లలో ముఖ్యులు.

రాష్ట్రాల వారీగా...

మహారాష్ట్ర- 7, తమిళనాడు- 6, తెలంగాణ- 2, ఛత్తీస్​గఢ్​- 2, హరియాణా- 2, ఒడిశా- 4, బిహార్- 5, బంగాల్-​ 5, అసోం- 3, హిమాచల్​ ప్రదేశ్-​ 1 స్థానాల్లో అభ్యర్థులకు పోటీ లేదని రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.

పార్టీలు ఇలా..

వీటిల్లో భాజపా వాటి మిత్ర పక్షాలు కలిసి 12+1(ఉప ఎన్నిక) సీట్లను దక్కించుకున్నాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి 12 స్థానాలు కైవసం చేసుకున్నాయి. తృణమూల్​- 4, బీజేడీ- 4, తెరాస-2 సాధించాయి.

18 స్థానాలకు..

గుజరాత్​-4, ఆంధ్రప్రదేశ్​- 4, రాజస్థాన్​- 3, మధ్యప్రదేశ్​- 3, ఝార్ఖండ్​- 2, మణిపుర్​, మేఘాలయ ఒక్కొక్క స్థానాలకు మార్చి 26న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:విమర్శలకు పార్లమెంట్​లోనే సమాధానం చెప్తా-గొగొయి

ABOUT THE AUTHOR

...view details