కరోనా వైరస్ నేపథ్యంలో పకడ్బంధీ ఏర్పాట్ల మధ్య రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు ముగిశాయి. ఓటర్లయిన శాసనసభ్యులు భౌతిక దూరం పాటించటం, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు ధరించటం వంటి జాగ్రత్తలను పాటించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 8 రాష్ట్రాల పరిధిలో 19 స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరిగింది. వీటిలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లోని నాలుగు సీట్లనూ అధికార వైకాపా కైవసం చేసుకుంది. ఝార్ఖండ్, మేఘాలయ, మిజోరంలలోని ఒక్కో సీటును అక్కడి పాలకపక్షాలు సొంతం చేసుకున్నాయి.
గుజరాత్ ఓట్ల లెక్కింపుపై వివాదం నెలకొనటం వల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది. రెండు భాజపా ఓట్లపై కాంగ్రెస్ అభ్యంతరం తెలపటం వల్ల కౌంటింగ్ నిలిచిపోయింది. ఇక్కడ నాలుగు స్థానాలకుగాను భాజపా ముగ్గురు అభ్యర్థులను, కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను రంగంలోకి దించాయి. భాజపా ఎమ్మెల్యే కేసరీసింహ్ సోలంకీ, మంత్రి భూపేంద్రసింహ్ ఓట్లను పరిగణనలోకి తీసుకోరాదంటూ విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని ఆలస్యంగా ఓట్ల లెక్కింపును చేపట్టారు. భాజపా మూడు స్థానాల్లో, కాంగ్రెస్ ఒకస్థానంలో విజయం సాధించాయి.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, ఇటీవలే కాంగ్రెస్ నుంచి భాజపాలోకి చేరిన జోతిరాదిత్య సింధియా పెద్దల సభకు ఎన్నికయ్యారు. కరోనా వల్ల క్వారంటైన్లో ఉండటంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో నలుగురు ఎమ్మెల్యేలు పీపీఈ దుస్తుల్లో వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు.
రాష్ట్రం | పార్టీ | గెలిచిన స్థానాలు |
ఆంధ్రప్రదేశ్ | వైకాపా | 4 |
గుజరాత్ | భాజపా కాంగ్రెస్ | 3 1 |
మధ్యప్రదేశ్ | భాజపా కాంగ్రెస్ |