తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వెంకయ్య, సుష్మల అన్నాచెల్లెల అనుబంధం'​

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ మృతి పట్ల రాజ్యసభ సంతాపం ప్రకటించింది. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు సభ్యులు. ఈ సందర్భంగా తనను సుష్మ.. అన్నా అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య.

'వెంకయ్య, సుష్మల అన్నాచెల్లెల అనుబంధం'​

By

Published : Aug 7, 2019, 12:06 PM IST

Updated : Aug 7, 2019, 12:35 PM IST

సుష్మా స్వరాజ్​ మృతికి రాజ్యసభ సంతాపం​

విదేశాంగ శాఖ మాజీ మంత్రి, భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్​ మృతి పట్ల రాజ్యసభ సంతాపం ప్రకటించింది. సభలో సంతాప సందేశాన్ని రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు చదివి వినిపించారు. అనంతరం సభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్​ తనకు చెల్లెలితో సమానమని పేర్కొన్నారు ఛైర్మన్​ వెంకయ్య. తనను ఎప్పుడూ 'అన్నా' అంటూ ఆప్యాయంగా పిలిచే వారని గుర్తు చేసుకున్నారు.

" శ్రీమతి సుష్మా స్వరాజ్​ దయ, కరుణ, ఆప్యాయత కలిగిన నేత. ఆమె అకాలమరణం తీరని లోటు. దేశం సమర్థువంతమైన పరిపాలకులు, గొప్ప పార్లమెంటు సభ్యురాలు, ప్రజల గొంతుకను కోల్పోయింది."

-సంతాప సందేశం

ఇదీ చూడండి: సుష్మ​ భౌతికకాయం వద్ద మోదీ భావోద్వేగం

Last Updated : Aug 7, 2019, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details