తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2019, 9:21 PM IST

Updated : Nov 18, 2019, 11:22 PM IST

ETV Bharat / bharat

సైనిక తరహా దుస్తుల్లో రాజ్యసభ మార్షల్స్​!

రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా మార్షల్స్​ సరికొత్త వస్త్రధారణలో మెరిసారు. తలపాగాలతో కూడిన భారతీయ సంప్రదాయ దుస్తుల నుంచి సైనిక తరహా దుస్తుల్లోకి మారారు. ఈ సరికొత్త మార్పు సభలో సభ్యులనూ ఆశ్చర్యానికి గురిచేసింది.

రాజ్యసభ మార్షల్స్​కు సైనిక తరహా దుస్తులు

రాజ్యసభ 250వ సమావేశం తొలిరోజు ఆ సభ మార్షల్స్​ సరికొత్త వస్త్రధారణలో కనిపించి సభలో సభ్యులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఎప్పటిలా తలపాగాలతో కూడిన భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కాకుండా.. సైనిక తరహా దుస్తుల్లో కనిపించారు.

రాజ్యసభ మార్షల్స్​కు సైనిక తరహా దుస్తులు

ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం ప్రకారం ఛైర్మన్​ పక్కన ఇద్దరు మార్షల్స్​ ఉంటారు. సభ కార్యకలాపాలను ప్రారంభించే సమయంలో ఛైర్మన్​ ముందు కవాతు నిర్వహిస్తారు. ఆర్డర్​ పేపర్లను తీసుకురావడం వంటి పనుల్లో సహాయం చేస్తారు.

ఈరోజు సంస్మరణ తీర్మానాలు చేస్తున్న క్రమంలో.. ఛైర్మన్​ కుర్చీ వద్ద ఉన్నది రాజ్యసభ మార్షల్సేనా అని ఓ సభ్యుడు ప్రశ్నించారు. దీనికి ఛైర్మన్​ వెంకయ్య నాయుడు అవును అని సమాధానం ఇచ్చారు.

సైనిక దుస్తులకు భిన్నంగా..

కొత్త యూనిఫాం ఆలివ్​ గ్రీన్​ రంగులో ఉన్నప్పటికీ.. ఇది సైనిక సిబ్బంది ధరించే వాటికి భిన్నంగా ఉంది. పసిడి రంగు వర్ణంతో కూడిన అల్లిన తాడును అలంకారం కోసం వినియోగించారు.

సీజన్​ల వారీగా..

రాజ్యసభ మార్షల్స్​ వస్త్రధారణ గతంలో సీజన్ల వారీగా ఉండేది. వేసవి కాలంలో సఫారీ సూట్లు​, శీతకాలంలో తలపాగాలతో కూడిన భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించేవారు.

ఇదీ చూడండి: రోడ్డుపై 'ట్రాఫిక్ నియమాల డ్యాన్స్'​ చూశారా?

Last Updated : Nov 18, 2019, 11:22 PM IST

ABOUT THE AUTHOR

...view details