తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మార్షల్స్​ డ్రెస్​కోడ్​పై సమీక్ష.. టోపీలు లేకుండా హాజరు

నూతన డ్రెస్​కోడ్​పై సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో గురువారం సభకు టోపీలు లేకుండా హాజరయ్యారు రాజ్యసభ మార్షల్స్​. పలువురు విపక్ష సభ్యులు, సైనిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన కారణంగా నూతన వస్త్రధారణపై సమీక్ష చేపట్టింది ఎగువసభ సచివాలయం.

మార్షల్స్​ డ్రెస్​కోడ్​పై సమీక్ష

By

Published : Nov 21, 2019, 4:58 PM IST

Updated : Nov 21, 2019, 7:02 PM IST

మార్షల్స్​ డ్రెస్​కోడ్​పై సమీక్ష.. టోపీలు లేకుండా హాజరు

రాజ్యసభ మార్షల్స్​ నూతన డ్రెస్​కోడ్​పై పలువురు సభ్యులు, సైనిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన కారణంగా వస్త్రధారణపై సమీక్ష చేపట్టింది ఎగువసభ సచివాలయం. సమీక్ష నేపథ్యంలో గురువారం సభకు మిలిటరీ తరహా టోపీలు లేకుండా హజరయ్యారు మార్షల్స్​.

రాజ్యసభ జీరో హవర్​లో కొందరు విపక్ష నేతలు మార్షల్స్​ డ్రెస్​కోడ్​ అంశాన్ని ప్రస్తావించారు. స్పందించిన సభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు.. నూతన దుస్తులు సైన్యం యూనిఫాం తరహాలో లేవని స్పష్టం చేశారు. దుస్తులపై చర్చ జరుగుతోందని వివరించారు.

సమీక్షకు ఆదేశం..

పెద్దలసభ 250వ సమావేశం తొలిరోజున నూతన వస్త్రధారణలో కనిపించారు మార్షల్స్​. తలపాగలతో కూడిన భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కాకుండా.. టోపీలతో నేవీ బ్ల్యూ, ఓలివ్​ గ్రీన్​ రంగులోని ఆర్మీ తరహా దుస్తుల్లో సభకు హాజరయ్యారు.

అయితే ఈ దుస్తులపై అభ్యంతరాల నేపథ్యంలో సమీక్షకు ఆదేశించారు వెంకయ్య. ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకురావాలని సూచించారు.

ఇదీ చూడండి: కేంద్రప్రభుత్వంలో 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం

Last Updated : Nov 21, 2019, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details