మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. బుధవారం రాజ్యసభలో మాక్ సెషన్ నిర్వహించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లను ఛైర్మన్ వెంకయ్య నాయుడు సమీక్షించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు జారీ చేసిన ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆయన సూచించారు.
కొత్త రూల్స్‌తో పార్లమెంట్లో మాక్ సెషన్ - వెంకయ్యనాయుడు వార్తలు
కరోనా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు బుధవారం సమీక్షించారు. ఈ మేరకు రాజ్యసభలో నిర్వహించిన మాక్ సెషన్లో ఆయన పాల్గొన్నారు. అధ్యక్ష స్థానంలో కూర్చున్న వెంకయ్య.. ఛాంబర్ నుంచి ఆడియో వీడియో సిగ్నల్స్ ప్రసారం చేసే విధి విధానాలను పరిశీలించారు.

పార్లమెంట్ సమావేశాలకు ముందు మాక్ సెషన్ నిర్వహణ
భౌతిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన సీట్ల ప్రకారం.. సభలో ఒక మాక్ సెషన్ నిర్వహించారు. సభాధ్యక్ష స్థానంలో వెంకయ్య నాయుడు కూర్చున్నారు. ఛాంబర్ నుంచి ఆడియో వీడియో సిగ్నల్స్ ప్రసారం చేసే విధానాన్ని క్షుణ్నంగా పరిశీలించిన ఛైర్మన్.. కొన్ని ఏర్పాట్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సెషన్ ప్రారంభానికి ముందే.. పార్లమెంట్ సభ్యులకు అన్ని నిబంధనలను స్పష్టంగా వివరించాలని అధికారులకు తెలిపారు.