సెంట్రల్ విస్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా.. 'రాజ్‌పథ్'ను పునర్మించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న ఈ దారి పునర్నిర్మాణ పనులకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.. గురువారం భూమి పూజ చేశారు.
'రాజ్‌పథ్' పునర్నిర్మాణ పనులకు భూమిపూజ
'రాజ్‌పథ్'ను పునర్నిర్మాణ పనులకు కేంద్రం గురువారం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ హాజరై భూమి పూజ నిర్వహించారు.
'రాజ్‌పథ్' పునర్నిర్మాణ పనులకు భూమిపూజ
ఇండియా గేట్ లాన్లో సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 2022 రిపబ్లిక్ డే నాటికి ఈ ప్రాంతంలో పరేడ్ నిర్వహంచాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించుకుంది. రాజ్‌పథ్ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టును షాపుర్జీ పల్లోంజి గ్రూప్ దక్కించుకుంది. అంచనా వ్యయం కంటే 4.99 శాతం తక్కువకు (రూ.477.08 కోట్లకు) బిడ్ దాఖలు చేసి ఈ ప్రాజెక్టు దక్కించుకుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి:'వాళ్లు.. రేపు మరొకరిని బెదిరించొచ్చు'