తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రజినీకాంత్ రాజకీయ​ పార్టీ ఏర్పాటు చేసేది అప్పుడే... - rajinikanth friends saiid his political party news

మే లేదా జూన్​లో సూపర్​స్టార్​ రజినీకాంత్​ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయొచ్చని చెప్పారు ఆయన సన్నిహితుడు త్యాగరాజన్. 2021లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే-రజినీకాంత్​ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషించారు. రజినీ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

rajnikanth-to-float-political-party-by-may-june-says-close-aide-k-thiyagarajan
రజినీకాంత్ రాజకీయ​ పార్టీ ఏర్పాటు చేసేది అప్పుడే...

By

Published : Feb 10, 2020, 3:45 PM IST

Updated : Feb 29, 2020, 9:13 PM IST

సూపర్​ స్టార్​ రజినీకాంత్​ ఎట్టకేలకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారా? మే-జూన్​లో ఎప్పుడైనా కొత్త పార్టీని ప్రకటించవచ్చా? అవుననే అంటున్నారు రజినీ సన్నిహితుడు కరాటే త్యాగరాజన్. 2021లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికలు... రజినీకాంత్​కు, డీఎంకేకు మధ్య ప్రత్యక్ష సమరం అవుతాయని జోస్యం చెప్పారు.

"మే లేదా జూన్​లో రజినీకాంత్​ రాజకీయ పార్టీ ప్రారంభిస్తారు. రజినీని ఎదుర్కోవాలంటే స్టాలిన్​ మరింత కసరత్తు చేయాలి. ఈ మధ్య ఆయన(స్టాలిన్​) తలైవా గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అలా చేస్తే వార్తల్లోకి ఎక్కవచ్చన్నది ఆయన ఆలోచన.

రజినీకాంత్​ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు. అధికారికంగా రాజకీయ పార్టీ ప్రారంభించాక.. డీఎంకే, అన్నాడీఎంకే కార్యకర్తలంతా రజినీకి మద్దతుగా నిలుస్తారు."

-కరాటే త్యాగరాజన్​, రజినీ సన్నిహితుడు

హిందుత్వ విషయంలో ప్రత్యర్థుల విమర్శల్ని తిప్పికొట్టారు త్యాగరాజన్. "రజినీకాంత్​ హిందూ ధర్మాన్ని నమ్ముతారు కానీ హిందుత్వను కాదు" అని స్పష్టంచేశారు.

రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని 2017 డిసెంబర్​లోనే ప్రకటించారు రజినీ. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు వేయలేదు.

Last Updated : Feb 29, 2020, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details