తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రక్షణరంగంలో ప్రైవేట్​ భాగస్వామ్యానికి ముందడుగు - defence procurement procedure

రక్షణరంగ పరికరాల అభివృద్ధిలో ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేసే విధానానికి సంబంధించిన నిబంధనావళిని రక్షణ మంత్రి రాజనాథ్​ ఆవిష్కరించారు. ఈ సంస్థలు అన్నీ ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా డీఆర్​డీవోతో కలిసి పనిచేయనున్నాయి.

Rajnath unveils new version of DRDO's procurement manual to engage pvt sector in defence R&D
రక్షణరంగంలో ప్రైవేట్​ భాగస్వామ్యానికి నిబంధనావళి విడుదల

By

Published : Oct 20, 2020, 9:06 PM IST

రక్షణ పరికరాల పరిశోధన అభివృద్ధి ప్రాజెక్టుల్లో ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేసేలా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో) నూతన ప్రొక్యూర్‌మెంట్‌ నిబంధనావళిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రైవేటు సంస్థలు, అంకురపరిశ్రమలు, సూక్ష్మ- మధ్యతరహా పరిశ్రమలు కూడా రక్షణ పరిశోధనరంగంలో భాగస్వాములు అయ్యేలా నూతన నిబంధనావళి ఉన్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. డీఆర్​డీవో చేసుకునే ఒప్పందాలు., ప్రాజెక్టులు, పరిశోధనలు ఈ నూతన ప్రొక్యూర్‌మెంట్‌ నిబంధనావళిని అనుసరించి ఉంటాయని తెలిపారు.

భారత్‌ని ప్రపంచ ఆయుధ తయారీ పరిశ్రమకు కేంద్రబిందువుగా మార్చడమే తమ లక్ష్యమని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు దేశీయ రక్షణ పరికరాల వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ఇటీవలి కాలంలో కేంద్రం అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చింది. కొత్త నిబంధనావళితో రక్షణరంగంలో త్వరితగతిన పరిశోధన- అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు మార్గం సుగమం కానుందని రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. వచ్చే ఐదేళ్ల వ్యవధిలో సైనికులకు ఆయుధాలను సమకూర్చేందుకే కేంద్రం 13వేల కోట్ల డాలర్ల మేర వ్యయం చేయనుంది.

ఇదీ చూడండి: నూతన రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానం ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details