పార్లమెంట్ సమావేశాల్లో భాజపా ఎంపీల హాజరు తక్కువగా ఉండడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజ్‌నాథ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎంపీల గైర్హాజరు విషయంలో ప్రధాని మోదీ కూడా అసంతృప్తిగా ఉన్నారని రాజ్‌నాథ్ తెలిపారు.
పార్లమెంట్లో అమిత్‌షా.. పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో భాజపా ఎంపీలంతా సభలోనే ఉండాలని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ బిల్లూ ఆర్టికల్ 370 రద్దు అంతటి ప్రాధాన్య అంశమేనని ఎంపీలకు ఆయన వివరించారు.